ICC Rankings : నెంబ‌ర్ వ‌న్ స్థానంలో జ‌డేజా.. రెండో స్థానంలో కోహ్లి

-

ఐసీసీ అన్ని ఫార్మెట్ల‌ ర్యాకింగ్స్ ను విడుద‌ల చేసింది. కాగ భార‌త జట్టు స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టెస్టు క్రికెట్ ఆల్ రౌండ‌ర్ జాబితాలో 385 పాయింట్ల‌తో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ర‌వీంద్ర జ‌డేజా ఉన్నారు. కాగ ఇదే ఫార్మెట్ లో భార‌త జ‌ట్టు మ‌రో ఆల్ రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్వీన్ 341 పాయిట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. కాగ 357 పాయింట్ల‌తో రెండో స్థానంలో వెస్టిండీస్ ఆట‌గాడు జోస‌న్ హోల్డ‌ర్ ఉన్నాడు.

అలాగే టెస్ట్ క్రికెట్ లో బ్యాటింగ్ విభాగానికి సంబంధించి.. టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ 7వ స్థానంలో, విరాట్ కోహ్లి 9వ స్థానంలో, 10 వ స్థానంలో పంత్ ఉన్నారు. వ‌న్డే బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ 811 పాయింట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నారు. అలాగే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఒక స్థానం కోల్పోయి.. నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు. కాగ పాక్ బ్యాట‌ర్ బాబ‌ర్ అజామ్ 873 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అలాగే వ‌న్డే బౌల‌ర్ల జాబితాలో బుమ్రా 6వ స్థానంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news