RRR: 20 రోజులు ఆ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తానన్న రాజమౌళి.. ఆయనెవరంటే?

-

టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర ప్రమోషన్స్ ఆకాశమే హద్దుగా చేస్తున్నారని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసిన రాజమౌళి తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమా గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా రాజమౌళి సందీప్ రెడ్డి డైరెక్షన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి దర్శకధీరుడు రాజమౌళి పలు విషయాలు చెప్పాడు.

sandeepreddy rajamouli
sandeepreddy rajamouli

ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి తన కోరికను రాజమౌళికి చెప్పాడు. తాను ‘ఈగ’ మూవీ టైంలో రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా 20 రోజుల పాటు పని చేయాలనుకున్నానని చెప్పాడు. కాగా, అప్పుడు చాలా సీరియస్‌గా ట్రై చేసినప్పటికీ సాధ్యపడలేదని చెప్పుకొచ్చాడు సందీప్. ఈ నేపథ్యంలో తనకు అవకాశమివ్వాలని రిక్వెస్ట్ చేశాడు ‘యానిమల్’ డైరెక్టర్. ఇకపోతే తాను కూడా అసిస్టెంట్‌గా వర్క్ చేస్తానని సందీప్‌కు చెప్పాడు. అందుకు సందీప్ ఒప్పుకోలేదు.

తాను తీసేది ఏం ఉండదని అనగా, ఏం లేకపోయినా ఎలా తీస్తున్నావో తెలుసుకునేందుకు తాను మారు వేషంలో సెట్‌కు వస్తానని జక్కన్న చెప్పాడు. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తీసిన తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ ఇదే సినిమాను ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. ప్రజెంట్ రణ్ బీర్ కపూర్‌తో ‘యానిమల్’ మూవీ చేస్తున్న సందీప్.. ప్రభాస్‌తోనూ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ కన్ఫర్మ్ కాగా, ఇది ప్రభాస్‌కు 25 వ చిత్రం కావడం విశేషం. ఈ సంగతులు పక్కనబెడితే ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని చెప్పాడు సందీప్.

Read more RELATED
Recommended to you

Latest news