GOOD NEWS: అండర్ 19 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

అండర్ 19 మెన్ క్రికెట్ వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను కాసేపటి క్రితమే ఐసీసీ విడుదల చేసింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి 14 నుండి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది. కాగా ఈ వరల్డ్ కప్ ను శ్రీలంక వేదికగా జరగనుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో మొత్తం 16 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. మొత్తం నాలుగు గ్రూప్ లుగా మొదలు కానున్న ఈ టోర్నమెంట్ లో గ్రూప్ ఏ లో ఇండియా, బంగ్లాదేశ్ ఐర్లాండ్ మరియు అమెరికాలు ఉన్నాయి, గ్రూప్ బి లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, స్కాట్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లు ఉండగా, గ్రూప్ సి లో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే మరియు నమీబియా లు ఉండగా, గ్రూప్ డి లో ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్ మరియు నేపాల్ లు ఉన్నాయి.

కాగా రీసెంట్ గా ఆసియా కప్ శ్రీలంక లో జరిగిన ఆసియా కప్ లో ఇండియా టైటిల్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ కూడా అదే దేశంలో జరగనుండగా ఇండియా కప్ ను గెలుస్తుందా చూడాలి.