అదోక వింత ఆచారం.. సమాధులనే అలా చేస్తారట..!

-

చనిపోయిన తర్వాత చాలా మంది వారి గుర్తుగా సమాధులను కట్టిస్తారు..అంతేకాదు వారికి చనిపొయిన వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కోసం కొన్ని ప్రత్యెకమైన వాటిని తయారు చేస్తారు.ప్రతి ఏడాది వారి సంవత్సరీకం రోజు వారికి ఇష్టమైన వాటిని పెట్టి స్మరించుకుంటారు.చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా సమాధులు కట్టడం, వర్ధంతులు, జయంతులు, పండుగ పూట పూజలు చేయడం మామూలుగా మనం చూస్తుంటాము..

ఎప్పుడూ వినని ఒక వింత ఆచారం ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామంలో వింత ఆచారం నడుస్తోంది. చనిపోయిన వారికి ఇక్కడ సమాధులు కట్టడమే కాకుండా పైన దేవతామూర్తుల విగ్రహాలు ఉంచి చిన్న పాటి గుడిలాంటిది నిర్మిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం పూజలు చేస్తుంటారు. దీంతో పాటు ఏటా తొలి ఏకాదశి రోజున ఇక్కడ జాతర కూడా చెయ్యడం గమనార్హం..పెద్ద బొమ్మయ్య వంశీకులు వచ్చి స్థిరపడిపోయారు.

ప్రస్తుతం ఆ వంశానికి చెందిన కుటుంబాలు గ్రామంలో 14 వరకు ఉన్నాయి. పెద్ద బొమ్మయ్య మరణానంతరం అతని జ్ఞాపకార్థం సమాధి నిర్మించిన కుటుంబసభ్యులు అక్కడ గంగమ్మ గుడిని కూడా నిర్మించారు.అప్పటి నుంచి పెద్ద బొమ్మయ్య వంశీకులు ఎవరు చనిపోయినా ఆలయం పక్కనే వారిని ఖననం చేసి సమాధి కడుతున్నారు.
సమాధులపై వేసిన చిత్రాలను దూరం నుంచి చూస్తే ఎవరో పడుకుని ఉన్నట్లుగా భ్రమ కలుగుతుండడం గమనార్హం. పెద్ద బొమ్మయ్య వంశస్తుల మరో ప్రత్యేకత ఏమిటంటే తమ కుటుంబంలో పుట్టే ప్రతి బిడ్డకూ బొమ్మయ్యే పేరునే పెడుతూన్నారు.. వాళ్ళు అక్కడ వారి తాతల కాలంలో వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతుందని వాళ్ళు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news