ఈ మధ్య కాలంలో దాదాపు అందరు గ్యాస్ పొయ్యిలనే వాడుతున్నారు. ఎల్‌పీజీ కనెక్షన్ అందరికీ ఉంది. అయితే ఒక్కో సారి మనం గ్యాస్ సిలెండర్లు పేలిపోవడం గురించి వింటూ ఉంటాం. నిజానికి గ్యాస్ సిలెండర్లు పేలిపోవడం అనేది ఎంతో ప్రమాదకరం. ఇలాంటప్పుడు ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది.
అలాంటప్పుడు ఎల్‌పీజీ కంపెనీ ద్వారా పరిహారం పొందొచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కస్టమర్లందరికి కంపెనీ నుండి ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ సమయంలో ఇవ్వడం జరుగుతుంది. అదే ఎల్‌పీజీ బీమా కవర్ పాలసీ. అయితే ఎప్పుడైనా సరే ప్రమాదవశాత్తు సిలిండర్ లీక్ అయినా లేదంటే సిలెండర్ , పేలినా నష్టాన్ని బట్టి పరిహారం ఇస్తారు.
50 లక్షల రూపాయలకు బీమా ని ఎల్‌పీజీ కంపెనీ ద్వారా పొందవచ్చు. సిలిండర్ పేలి ఎవరైనా చనిపోయినా గాయపడినా లేదా ఆస్తి నష్టం జరిగినా రూ.40 లక్షల వరకు పరిహారం వస్తుంది. ప్రాణ నష్టం అయితే రూ.50 లక్షల వరకు పొందవచ్చు. ఆస్తినష్టం కి అయితే రూ.2 లక్షల పరిహారం వస్తుంది. సిలిండర్ ఎవరి పేరు మీద కనెక్ట్ చేయబడిందో వాళ్ళకే ఈ డబ్బులు వస్తాయి. డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీ ని సంప్రదించక్కర్లేదు. డిస్ట్రిబ్యూటర్ ని సంప్రదిస్తే సరిపోతుంది.