అవును.. ఇక నుంచి దేనికోసమైనా ఆధార్ కావాలని ఒత్తిడి చేస్తే వాళ్ల తిత్తి తీయనున్నారు. బ్యాంకులో ఖాతా కోసం, మొబైల్ కనెక్షన్ కోసం ఆధార్ మాత్రమే కావాలని అని అడిగేవాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి నిర్ణయం. అటువంటి వాళ్లకు కోటి రూపాయల వరకు జరిమానా విధించి… మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందట.
అంతే కాదు.. ఆధార్ డేటా ను దుర్వినియోగం చేయాలని ప్రయత్నించేవాళ్లకు కూడా 50 లక్షల రూపాయల జరిమాన, పదేళ్ల జైలు శిక్ష వేస్తారట. ఇంకా ఉన్నాయి… కస్టమర్ ఒప్పుకోకుండా అతడి ఆధార్ డేటాను తీసుకుంటే… పది వేల రూపాయల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష వేస్తారట.
కస్టమర్ల ఆధార్ గుర్తింపు నెంబర్, ఫోటోను అన్ అఫీషియల్ గా పబ్లిష్ చేస్తే పది వేల రూపాయల నుంచి లక్ష వరకు జరిమానా విధిస్తారు. వీటన్నింటినీ పార్లమెంటులో త్వరలో చట్టం చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఇటీవలే ఆమోదం తెలిపింది.