బీజేపీకి 400 సీట్లు వస్తే.. బీసీలు ఆగమే : మంత్రి పొన్నం ప్రభాకర్

-

బీజేపీకి 400 సీట్లు వస్తే.. బీసీలు ఆగమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన కురుమల ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గొల్ల కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. కురుమ కార్పొరేషన్ వేరుగా ఏర్పాటు చేయాలని బీర్ల ఐలయ్య కోరినట్టు తెలిపారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు.

ఎన్నికల ముగియగానే ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ బీసీలకు వ్యతిరేక పార్టీ అని.. రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తుందన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే.. బీసీలు ఆగమవుతారనే ముందే ఉత్తర భారతదేశం గ్రహించి బీజేపీకి వ్యతిరేకంగా పని చేసిందని తెలిపారు. పాంచ్ న్యాయ్ అని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. బీజేపీ రాముడిని నమ్ముకొని రాజకీయం చేస్తుందని.. బీజేపీ రిజర్వేషన్లను టచ్ చేస్తే.. తొక్కలు తీస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నేతలు నిన్నటి నుంచి రిజర్వేషన్ లు రద్దు చేయం అని పేర్కొంటున్నట్టు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version