33 జిల్లాలు ఎవరు చెయ్యమన్నారు..? కోమటిరెడ్డి సంచలన కామెంట్స్..!

-

ఏం లేనప్పుడే మునుగోడులో రాజీనామా చేసి మూడు నెలల పాటు బీఆర్ఎస్ కి చెమటలు పట్టించాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వారిని బయట తిరగనిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భువనగిరి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు. తెలంగాణని 33 జిల్లాలని ఏర్పాటు చేశారు అల్లుడికి ఒక జిల్లా కొడుక్కి ఒక జిల్లా ఇచ్చాడు.

ఎవడు చేయమన్నాడు 33 జిల్లాలు అని అన్నారు. 20 జిల్లాలు చేస్తే చాలు ఒకప్పుడు చేర్యాల జనగామ అంటే ఎంత బాగుండేది అని అన్నారు హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మండలాలు చేశాడు. చేర్యాల వాళ్ళు ఒక పని మీద హుస్నాబాద్ ఇంకో పని మీద సిద్దిపేట ఇంకో పని కోసం మరోచోటికి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఇదేమైనా హరీష్ రావు జేబు సంస్థ అని అన్నారు ఎంపీ ఎన్నికలు అవ్వగానే హరీష్ రావు ని కూడా బొక్కలో వేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version