మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిస్తే దేశ ప్రజలు స్వేచ్ఛను కోల్పోతారని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు తమకు పోటీయే కాదని అన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఎద్దేవ చేశారు. ఒకవేళ బీజేపీ మళ్లీ గెలిస్తే.. ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజేపీ ప్రమాదకరంగా మారుతుందని ఆరోపించారు .
రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిపై బీజేపీ రాజకీయం చేస్తూ నాటకాలు ఆడుతోందని, వారి మాటలను ఎవరూ విశ్వసించరని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయంగా కారు పార్టీ ఇప్పటికే కుదేలైందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో టీంగా పని చేస్తోందని వెల్లడించారు. అదేవిధంగా పీడీఎస్ బియ్యంలో అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు.