తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పేరు పొందాడు దిల్ రాజ్. దిల్ రాజు పూర్తి పేరు వెంకటరమణారెడ్డి. చిన్నతనం నుంచే తన కుటుంబం అంతా రాజు అని పిలవడంతో ఆయన పేరు రాజు గా పెట్టుకున్నారట. ఈయన జన్మ స్థలం తెలంగాణలోని నిజామాబాద్ లో జన్మించారు. ఈయన చదువు కూడా హైదరాబాద్లోనే కొనసాగించారు. దిల్ సినిమాకి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవడంతో ఇక ఆయన పేరు దిల్ రాజు గా పిలవడం మొదలుపెట్టారు. దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి, తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజు కు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.. అందులో ఒకరు విజయ్ సింహారెడ్డి.. మరొకరు నరసింహారెడ్డి.
దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత.. ఇక ఈయనకు ఒక కూతురు కూడా ఉన్నది. ఆమె పేరు హన్షిత రెడ్డి. ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత తన ఆరోగ్యం సరిగా లేక మరణించడం జరిగింది. ఇక ఆమె మరణించడంతో 2020 వ సంవత్సరంలో తేజస్విని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. చిన్నతనం నుండి దిల్ రాజుకు సినిమాలు అంటే చాలా పిచ్చి ఉండడం చేత.. అందుచేతనే మొదటగా సినిమాల డిస్ట్రిబ్యూటర్ గా చేశారు.ఇక అలా డిస్ట్రిబ్యూటర్ చేస్తున్న సమయంలో నిర్మాతగా ఒక సినిమాకి అవకాశం వచ్చింది. మొదటిగా 1998లో పెళ్లి పందిరి సినిమా కి అవకాశం వచ్చింది దిల్ రాజ్ కి ఇక ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో కూడా సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం చిన్న చిత్రాలను కూడా నిర్మిస్తూ చాలా బిజీగా ఉన్నారు. దిల్ రాజు దగ్గర ఐదు ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి విలువ రూ.4 కోట్ల పైనే ఉంటుంది. దిల్ రాజు ఇల్లు బంజారాహిల్స్ లో ఉన్నది. దీని విలువ రూ.25 కోట్లకు పైగా ఉంటుంది. దిల్ రాజ్ ఆస్తి సుమారుగా రూ.1000 కోట్లకు పైగా ఉంటుంది.. తన సినిమాలలో సంపాదించిన డబ్బును అంతా ఎక్కువగా ల్యాండ్ కొనడానికే ఉపయోగిస్తారట. కేవలం స్వతహాగా ఇంతటి ఆస్తిని సంపాదించారు దిల్ రాజు.