సుకుమార్ క్లారిటీ మిగతా డైరెక్టర్స్ కి ఉంటే ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్సే …!

-

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ తో పాటు బన్నీ లుక్ ని కూడా రివీల్ చేశారు. పుష్ప అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రివీల్ చేశారు. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియ రేంజ్ లో తెరకెక్కుతోంది. పుష్ప సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సుకుమార్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసందే. ఆ తర్వాత తిరిగి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు. అయితే ఇప్పుడు సుకుమార్ మీద ఒత్తిడి ఎక్కువవుతుందని అంటున్నారు. ఎటూ పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతుంది కాబట్టి 2021 సంక్రాంతి టార్గెట్ పెట్టుకొని సినిమాని కంప్లీట్ చేయమని నిర్మాతలు అంటున్నారట. అయితే ఇప్పటికే ఆ బరిలో దిగడానికి కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలోనే ఈ సంవత్సరం రిలీజవ్వాల్సిన సినిమాలు వెనక్కి జరిగి వెనక్కి జరిగి .. సంక్రాంతి కి రిలీజ్ చేయాలని అంటున్నారు.

అందులో ఆర్.ఆర్.ఆర్ తో పాటు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి సినిమా అలాగే ప్రభాస్ రాధా కృష్ణ సినిమా, వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నారప్ప ..ఇలా పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇది తెలిసి కూడా పుష్ప ని సంక్రాంతి కి రిలీజ్ చేద్దామని నిర్మాతలు అంటున్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా సమయం పడుతుందని తొందరపడ్డా, తొందర పెట్టినా కష్టం అంటూ సుకుమార్ సమాధానమిచ్చారట. ఎక్కువ భాగం ఫారెస్ట్ బ్యాగ్ డ్రాప్ లో తీయాలి కాబట్టే సంక్రాంతికి కంప్లీట్ చేయడం సాధ్యం కాదని నిర్మొహమాటంగా చెప్పారట. అందరూ ఇంతే క్లారిటీగా ఉంటే నిజంగా బ్లాక్ బస్టర్స్ వస్తాయని ఇప్పుడు సుకుమార్ గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news