హెడ్ ఫోన్స్ ఇలా వాడితే..చెవులకే కాదు..బ్రెయిన్ కు కూడా ప్రమాదమే..!

-

హెడ్ ఫోన్స్ పెట్టుకోని వారు ఈరోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు..ఎ క్కడికి వెళ్లినా కచ్చితంగా ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే. పాటలు వింటూ ప్రయాణం చేస్తారు. బయటకు వెళ్లినప్పుడు హెడ్ సెట్ లేకపోతే.. మనకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఫోన్ లో ఏమైనా చూద్దాం అంటే.. సౌండ్ బయటకు వస్తుంది.. మనకు అది నచ్చదు. కాబట్టి కచ్చితంగా ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే.. కానీ వైద్యులు ఇలా హెడ్ ఫోన్స్ వాడొద్దని చెబుతున్నారు. బయటకు వచ్చే సౌండ్స్ విన్నప్పుడు.. కొంత సౌండ్ మాత్రమే మనకు వెళ్తుంది. కానీ..

హెడ్ ఫోన్స్ లాంటివి పెట్టినప్పుడు అది ఎంత అయితే వాల్యూమ్ వస్తుందో అంత మనలోకే వెళ్తుంది. సౌండ్ డిస్టిబ్యూట్ కాకుండా.. కాన్సన్ ట్రేటెట్ ఫామ్ లో వెళ్లి అనేక సమస్యలను కలిగిస్తుందట. 2011వ సంవత్సరంలో అమెరికన్ మెడికల్ అసోసియోషన్ వాళ్లు ఒక పరిశోధన చేసి హెడ్ పోన్స్ పెట్టుకోవడం వల్ల వయసులో ఉన్న పిల్లలకు 38శాతం చెవుడు వచ్చేస్తుందని వాళ్లు కనుక్కున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం చాలా ప్రమాదం.. ఇయర్ డ్రమ్ కు బాగా వైబ్రేషన్ వచ్చేట్లు కొడతాయి.. ఇది చెవును బాగా ఇరిటేట్ చేస్తుంది.

ఇంకా కొంతమంది.. పక్కనవాళ్ల హెడ్ ఫోన్స్ వాడుతుంటారు. బయటపెట్టినప్పుడు ఈ హెడ్ ఫోన్స్ మీద బాక్టీరియాలు చేరుతాయి. తద్వారా.. చెవు ఇన్ఫెక్షన్ కు గురవతుంది. ఇలాంటి వాటివల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. హై వైబ్రేషన్ తో వినేప్పటికి.. నష్టం ఎక్కువగా ఉంటుంది.

మనకు ఉన్న అవయాలాల్లో చెవులు కూడా చాలా ప్రధానం..కంటితో చూడాలి, చెవితో వినాలి, మనసుతో ఆలోచించాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. చెవులు వినడానికి లేకపోతే.. మన జీవితం సగం పోయినట్లే కదా. ఇయర్ డ్రమ్స్ ఎఫెక్ట్ అవడానికి ప్రధానంగా ఇయర్ ఫోన్స్ కారణం.

హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల చెవులే కాదు.. వేరే పార్ట్స్ కి కూడా నష్టమే..

హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల హై ఫ్రీకెన్వీసీలో సౌండ్ వెళ్తుంది. ఇది బ్రెయిన్ కు ఎక్కువగా వెళ్తుందట. దీనివల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవడం, మెమరీలాస్ అవడం, భవిష్యత్తులో ఏజ్ పెరిగే కొద్ది ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. కొందరైతే రోడ్డుమీద నడుస్తూ కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకుని పోతుంటారు. ప్రమాదాలు జరగడానికి మూల కారణం. వీటన్నింటికంటే ముఖ్యంగా చెవుడు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

తప్పుదు హెడ్ ఫోన్స్ వాడలి అంటే..

రెండు చెవులకు పెట్టొదు. ఒక చెవికి మాత్రమే పెట్టండి. తక్కువ వాల్యూమ్ లో వినండి.. ఎయిర్ ఫ్లో ఉండాలి.. మొత్తం చెవిలో పెట్టకుండా కాస్త బయటకు పెట్టుకుంటే.. సౌండ్ ఎక్కువగా వెళ్లదు.

ఇప్పటివరకూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఈ ప్రపంచానికి దూరంగా…మనకంటూ ఒక సపరేట్ ప్రపంచం ఉందని..దానికి దగ్గరగా వెళ్తుంటారు. బయట సౌండ్స్ ఏమీ పట్టించుకోకండా.. ఎక్కువ సౌండ్ పెట్టుకుని వింటారు. దీనివల్ల ఇప్పుడు ఏం సమస్య తెలియకపోవచ్చు.. కానీ కొన్నాళ్లకు చిన్న చిన్న శబ్దాలను కూడా భరించలేరు.. పైన చెప్పిన సమస్యలు అన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇకనుంచైనా..హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించడి..ప్రమాదం నుంచి తప్పించుకోండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news