భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలంటే భార్య భర్తలు కొన్ని వాటిని ఫాలో అవుతూ ఉండాలి. చాలామంది భార్యాభర్తల మధ్య ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది. అయితే గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోవాలి తప్ప గొడవల్ని పెద్దవాటిగా మార్చుకోకూడదు. ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ కూడా ఎక్కువగా కష్టపడుతున్నారు.
ఇటువంటి సమయంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పిల్లలు కలిగిన భార్యాభర్తలు జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి అలానే ఇంట్లో పనులను కూడా పంచుకుంటూ ఉండాలి. అప్పుడే భార్యాభర్తలు ఇద్దరూ కూడా రిలాక్స్ గా ఉండడానికి అవుతుంది. పూర్వకాలంలాగ ఇంట్లో పనులు నేను చేయను అని భర్త అనకూడదు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే వాళ్ల సంసార సాగరంని ఆనందంగా ఈదచ్చు.
బిడ్డ సంరక్షణలో సాయం చేయడం:
కేవలం భార్య మాత్రమే కాకుండా భర్త కూడా బిడ్డ సంరక్షణ పట్ల భర్త కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా బిడ్డకి సంబంధించి పనులు చేయాలి అప్పుడు భార్యకి కూడా కాస్త రిలాక్సేషన్ ఉంటుంది.
వంటలో సహాయం:
భార్య వంట చేస్తే భర్త కూరగాయలు కట్ చేసి ఇవ్వడం లేదంటే క్లీన్ చేయడం ఇటువంటి చిన్న చిన్న పనులు చేస్తే కూడా భార్యకి పని త్వరగా పూర్తవుతుంది కాసేపు విశ్రాంతి దొరుకుతుంది.
వంటలు చేయడం:
భార్యకి వంట విషయంలో సహాయం చేయడం ఏదైనా మంచి వంటను భర్త తనకి తయారు చేయడం ఇలా చిన్న చిన్నవి చేస్తే భార్యకి ఆనందంగా ఉంటుంది అలానే భర్తకి సంబంధించిన పనులు కూడా భార్యలు చేస్తే వారికి కాస్త పని తప్పుతుంది. ఇలా ఒకరికి ఒకరు సహాయం చేస్తే కచ్చితంగా వాళ్ళ దాంపత్య జీవితంలో బరువు ఉండకుండా ఉంటుంది ఆనందంగా ఉండగలరు.