సమంతను టెన్షన్ పెడుతున్న ” యశోద “

-

అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా 11-11-2022 నాడు థియేటర్లలో  విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం సమంత తో నిర్మాతలు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా మొత్తం సమంత పేరు మీదే బిజినెస్ జరిగింది.

దీంతో సినిమా కు హైప్ రావటం కోసం అన్ని రకాల గా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో స్టార్ హీరో విజయ్ దేవరకొండ తోను. కోలీవుడ్ లో సూర్య చేతుల మీదుగా, కన్నడలో హీరో రక్షిత్ శెట్టి తోను మలయాళంలో క్రేజి హీరో దుల్కర్ చేతుల మీదుగా ,అదే హిందీలో వరుణ్ ధావన్ తో ఈ ట్రైలర్ ను లాంచ్ చేపించారు.

వాస్తవానికి నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత పై మీడియాలో విపరీత మైన నెగెటివ్ ప్రచారం జరిగింది. విడాకుల తర్వాత సమంత ఫోటో షోస్ లో స్కిన్ షో ఎక్కువ చేయడం, ఎక్కువ సినీమాలలో నటిస్తుండడం తో అది ఇంకా పెరిగి పోయింది. ఇప్పుడు ఈ ప్రచారం ను ఎదుర్కోవాలంటే తనకి తప్పని సరిగా సోలో హిట్ కావలసిందే. అదే తనని విపరీతంగా టెన్షన్ పెడుతోంది. తన అదృష్టం కొద్ది ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంటోంది.నవంబర్ 11 కి తన సినిమా హిట్టో ,పట్టో తెలిసి పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news