ఆసియన్ గేమ్స్ లో “ఇండియా VS పాకిస్తాన్” ఫైనల్ ?

-

చైనా లోని గ్యాంగ్జౌ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 లో భాగంగా క్రికెట్ ను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అందులో భాగంగా మొదటగా మహిళల క్రికెట్ ను పూర్తి చేయనుంది ఆసియన్స్ గేమ్స్ నిర్వాహకులు. ఈ రోజు ఇండియా మరియు మలేషియా మహిళల మధ్యన క్వార్టర్స్ జరుగగా వర్షం కారణంగా రద్దు కావడంతో ఇండియాను సెమీఫైనల్ కు చేర్చారు. అదే విధంగా మరో క్వార్టర్ ఫైనల్ లో పాకిస్తాన్ ఇండోనేసియా తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దు అవడంతో పాకిస్తాన్ ను సెమీఫైనల్ కు వెళ్లినట్లుగా ప్రకటించింది. ఫస్ట్ సెమీఫైనల్ లో ఇండియా మహిళలు మొదటి జట్టుగా స్థానం సంపాదించగా, రెండవ సెమీఫైనల్ లో మొదటి జట్టుగా పాకిస్తన మహిళలు చేరుకున్నారు. ఇక రేపు జరగనున్న మూడు మరియు నాలుగవ క్వార్టర్ ఫైనల్ లో శ్రీలంక థాయిలాండ్ మరియు బంగ్లాదేశ్ హాంకాంగ్ లు తలపడనున్నాయి.. ఈ రెండు గ్రూప్ లలో గెలిచిన జట్లు ఇండియా పాకిస్తాన్ లతో తలపడనున్నాయి..

- Advertisement -

ఒకవేళ బంగ్లాదేశ్ మరియు శ్రీలంక లు అర్హత సాధిస్తే… సెమిఫైనల్ వన్ లో ఇండియా గెలిచి మరియు సెమీఫైనల్ 2 లో పాకిస్తాన్ గెలిస్తే ఫైనల్ లో ఇండియా మహిళలు మరియు పాకిస్తాన్ మహిళలు ఆడే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విధంగా జరుగుతుందా అన్నది తెలియాలంటే సెమీఫైనల్ ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...