బాడీ ఫ్యాట్ లో లైపో ప్రోటీన్స్ తక్కువైతే గుండెజబ్బులు ఖాయమేనా..?

-

లైపో ప్రోటీన్స్ గురించి మనకు చాలా తక్కువ అవగాహన ఉంటుంది. . మనం నూనె పదార్థాలు తిన్నప్పుడు అవి రక్తంలో కలవు. ఎలాగైతే.. ఆయిల్ లో వాటర్ వేస్తే.. విడిగా ఉంటుందో.. బాడీలోపల కూడా అదే జరుగుతుంది. ఈ ఆయిల్ ను రక్తంలో కలిపి మోసుకెళ్లడానికి ఉపయోగపడే వాటినే లైపో ప్రొటీన్( Lipoproteins) అంటారు. మన శరీరంలో కొవ్వును ఈ ప్రొటీన్ పట్టుకుని.. లివర్ కు మోసుకెళ్లడానికి, అక్కడ నుంచి శరీరం అంతా మోసుకెళ్లడానికి.. మళ్లీ రివర్స్ జర్నీ చేయడానికి ఈ లైపో ప్రొటీన్స్ అనేవి వాహనంలా ఉపయోగపడతాయి.
కొవ్వు రక్తంలో కలవడానికి ఈ లైపో ప్రొటీన్స్ కొవ్వును లోపల పెట్టుకుంటాయి. ఇవి ఎనిమిది రకాలుగా ఉంటాయట. ఈ ప్రొటీన్ ఉండే శాతాన్ని బట్టి.. కొన్ని రకాలుగా విభజించబడతాయి.HDL, LDL, VLDL, ట్రైగ్లిజరెయిడ్స్ కొలెస్ట్రాల్ గా ఉంటాయి. హెడీఎల్ కొలెస్ట్రాల్ అంటే.. గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. . ఇది గుండెజబ్బులు రాకుండా రక్షిస్తుంది. ఇందులో 40-50శాతం లైపోప్రొటీన్ ఉంటుంది. అదే ఎల్డీఎల్ లో 20% లైపో ప్రొటీన్ ఉంటుంది. అందుకే దీన్ని.. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇందులో ప్రొటీన్ చాలా తక్కువ శాతం ఉంటుంది. వెరీ లో డెన్సిటీ లైపో ప్రొటీన్ (VLDL) ఇందులో ప్రొటీన్ 7శాతం మాత్రమే ఉంటుంది. ఈ లైపో ప్రొటీన్ ఉండే శాతాన్ని బట్టి అది ఎలాంటి కొలెస్ట్రాల్ చెప్తారు. మనం ఒక ఎమ్ఎల్ ఆయిల్ తీసుకుంటే.. ఒక గ్రాము వెయిట్ వస్తుంది.
బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. మనం అందించే ఆహారమే మెయిన్. దీన్ని బట్టే ఇవి మారుతాయి. అవిసెగింజలు, బాదంపప్పులు, రాజ్మా గింజలు, మెలకలు, సోయాబీన్స్ ఎక్కువగా తీసుకుంటే.. మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. స్లోగా డైజెషన్ అవుతాయి. మెల్లగా బ్లడ్ లోకి వెళ్తాయి. కాబట్టి ఇలాంటివి అన్నీ గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి బాగా ఉపయోగడతాయి.
వైట్ ప్రొడెక్ట్స్.. పాలిష్ పట్టిన బియ్యం, పిండి, రవ్వలు ఎక్కువగా తింటే త్వరగా బ్లడ్ లోకి వెళ్లి కొవ్వుగా మారి.. ట్రైగ్లిజరేడ్స్ గా బ్లడ్ లో ప్రయాణిస్తాయి. ఇందులో లైపోప్రొటీన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి.. బ్లడ్ లో ఫ్యా్ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా గుండెజబ్బులు రావడానికి అవకాశం అధికం.

ఆకుకూరలు, నట్స్ తింటుంటే.. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు అన్నీ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఈరోజుల్లో హార్ట్ బ్లాక్స్ రావడానికి ప్రధాన కారణం.. రక్తనాళాలల్లో కొవ్వు ఎక్కువై పూడికలు రావడమే. కాబట్టి లైపోప్రొటీన్ ఎక్కువ మోతాదులో ఉండే.. గుడ్ కొలెస్ట్రాలన్ పెంచే ఆహారాలు తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

అవిసె గింజలను దోరగా వేయించుకుని గ్రైండ్ చేసుకుని ఖర్జూరం కలిపి లడ్డూలు చేసుకుని డైలీ భోజనం తర్వాత ఒకటి తినటం ఫ్యామిలీ అంతా అలవాటు చేసుకుంటే.. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాల వల్ల అనేక లాభాలు చేకూరుతాయి. ఇంకా పొడి చేసుకుని కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఏదో ఒకరూపంలో డైలీ అవిసెగింజలను వాడుకోవడానికి మాత్రం ట్రై చేయడం ముఖ్యం.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news