లోన్ డబ్బులు ముందే చెల్లిస్తే వడ్డీ రేటులో తగ్గింపు: స్పెషల్ స్కీమ్

-

వీధి వ్యాపారుల కోసం కేంద్రం ప్రత్యేకమైన రుణ పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకం వలన చక్కటి లాభాలని పొందొచ్చు. ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పధకం పేరు పీఎం స్వనిధి స్కీమ్.

ఈ పథకానికి అర్హులైన వీధి వ్యాపారాలు ఈజీగా లోన్ పొందొచ్చు. రూ.10 వేలు ఇస్తారు. ఒకవేళ కనుక తీసుకున్న రుణాన్ని కరెక్ట్ టైమ్‌కి కానీ దాని కంటే ముందే కానీ చెల్లిస్తే వడ్డీ రాయితీ లభిస్తుంది. వడ్డీ రేటు లో 7 శాతం వరకు సబ్సిడీని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

ఇది ఇలా ఉంటే ఈ డబ్బులు ప్రతి మూడు నెలలకు ఒక సారి రుణ గ్రహీత బ్యాంక్ ఖాతా లో జమ అవుతుంది. మీరు ఈ రుణ మొత్తాన్ని ముందే చెల్లిస్తే.. మళ్లీ లోన్ తీసుకో వచ్చు. అదే విధంగా వడ్డీ రాయితీ తో పాటు మళ్లీ లోన్ ఫెసిలిటీ లభిస్తుంది.

ఇక ఎలా లోన్ వస్తుంది అనేది చూస్తే.. పీఎం స్వనిధి వెబ్‌సైట్‌కు వెళ్లి ఈజీగా లోన్ కోసం అప్లై చేసుకో వచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చెయ్యాలి. అలానే బ్యాంకులు సహా ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా ఈ తరహా లోన్స్ ని ఇస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news