రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులందరికీ తెలంగాణ సర్కార్ తరుపున రూ. 3 లక్షల పరిహారం అందిస్తామని కేసీఆర్ నిన్న ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నిర్ణయం మంచిదే అని.. కానీ తెలంగాణ ప్రజల సంగతేంటని విపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రైతులు మరణిస్తే పరిహారం ఎందుకు ఇవ్వలేదని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సర్కారును ప్రశ్నించారు. తాజాగా వైెఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిళ కూడా కేసీఆర్ ను ప్రశ్నిస్తూ.. ట్విట్ చేసింది.
ట్విట్టర్ వేదికగా మరోసారి కేసీఆర్ పై వైఎస్ షర్మిళ సెటైర్లు వేశారు.’’ కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట..! బయటి రాష్ట్రం రైతులకు మూడు లక్షల రూపాయలు ఇస్తారా..? మన రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారికి , ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు, రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చారు సార్..? తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా..?‘‘ అని సీఎం కేసీఆర్ ను పరోక్షంగా వైఎస్ షర్మిళ ప్రశ్నించారు.
కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట!
బయటి రాష్ట్ర రైతులకు 3 లక్షలు ఇస్తారా?
మన రాష్ట్రంలొ కరోనాతో చనిపోయిన వాళ్లకు,
ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు,
ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చారు సారు?
తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా?— YS Sharmila (@realyssharmila) November 21, 2021