ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగం మీద చంద్రబాబు నాయుడుమీద కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్ట్ లో ప్రొడ్యూస్ చేసిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ కు తరలించారు. కాగా ఈ రిమాండ్ రిపోర్ట్ మరియు ఎఫ్ ఐ ఆర్ లపై హ్యాపీ గా లేని చంద్రబాబు లాయర్లు ఈ కేసును కొట్టివేయాలని క్వాష్ పిటీషన్ ను హై కోర్ట్ లో వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ పిటీషన్ పై విచారణ ఉదయం నుండి చంద్రబాబు తరపున లాయర్ మరియు సీఐడీ తరపున లాయర్ లు హోరా హోరీగా వాదించుకున్నారు. కానీ ఈ తీర్పును ప్రకటించని న్యాయస్థానం రిజర్వు చేసి పెట్టింది. ఒకవేళ ఈ తీర్పుకనుక చంద్రబాబు కు వ్యతిరేకంగా వచ్చి క్వాష్ పిటీషన్ ను కొట్టివేస్తే ?
సిఐడి విచారణను మరింత వేగవంతం చేయడమే కాకుండా, ఏసీబీ కూడా చంద్రబాబు కస్టడీ కి తీసుకునే విషయంలో ముందుకు కదలనుంది. కాగా మరో మూడు రోజుల్లో రిమాండ్ గడువు ముగియనుండగా, ఇంకా గడువును పొడిగించాలని కూడా సీఐడీ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.