ప్రతిసారి తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారు : హరీశ్‌ రావు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరునెలలకు ఓ ముఖ్యమంత్రి మారుతారని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆయన మాట్లాడుతూ… తాము అధికారంలోకి వస్తే చాలా చేస్తామంటూ కాంగ్రెస్ హామీలు ఇస్తోందని కానీ కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఆసుపత్రులు బాగా లేవని సరిహద్దు గ్రామాల వారు తెలంగాణకు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బాస్ ఢిల్లీలో ఉంటారని, వారు కనీసం మంచినీళ్లు తాగాలన్నా ఢిల్లీకి పరుగెడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జూటా మాటలు, అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు.

Expedite works of nine new medical colleges: Harish Rao

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవకాశం వస్తే తెలంగాణపై విషం చిమ్ముతారని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. మంత్రి హరీష్‌రావు, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ – ఏపీ విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని మోదీ చెప్పారు. మోదీ కడుపులో ఉన్న విషాన్ని ఇప్పుడు బయటికి కక్కుతున్నారు. మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు. బీజేపీవి అన్ని అబద్ధాలే.. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా.. తెలంగాణపై విష ప్రచారాలు మానుకోవాలి.