ప్రజానాడి: కుత్బుల్లాపూర్ మళ్ళీ కేపీ వశమా? కూన చెక్ పెడతారా?

-

రాజకీయాల్లో ప్రజలందరి మనసులు గెలుచుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఏ నాయకుడు కూడా ప్రజలని పూర్తిగా మెప్పించలేరు. కానీ మెజారిటీ ప్రజల మద్ధతు పొందితే గెలుపు అనేది సులువుగా వస్తుంది. అందులోనూ ఎక్కువ మద్ధతు పొందిన నాయకుడుకు తిరుగుండదు. అలాంటి నాయకుల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ఒకరు అని చెప్పవచ్చు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు మద్ధతు ఎక్కువ కూడబెట్టుకున్న నాయకుడు.

సాధారణంగా ఏ నాయకుడైన వరుసగా గెలిస్తే..కాస్త ప్రజా వ్యతిరేకతని ఎదురుకోవాలి. కానీ వివేకానంద అలా కాదు..తనదైన శైలిలో ప్రజలకు సేవ చేయడం..నిత్యం ప్రజల మధ్యలో తిరగడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం..వాటిని పరిష్కరించడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, పార్టీలకు అతీతంగా పనిచేయడంతో..కుత్బుల్లాపూర్ లో వివేకానందకు ప్రజా మద్ధతు ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు. మొదటసారి పోటీ చేసినప్పుడు వివేకానందకు ఇంతటి మద్ధతు లేదు. అప్పుడు ఓటమి పాలయ్యారు.

kp

కానీ 2014 ఎన్నికల్లో తొలిసారి అద్భుత విజయం అందుకున్నారు. 2014లో 39 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. టి‌డి‌పి నుంచి గెలిచిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు, టి‌డి‌పి ఏపీకి పరిమితం కావడం..ఇటు కే‌సి‌ఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి బాటపట్టిన నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇక 2018 ఎన్నికల్లో మళ్ళీ బరిలో దిగారు.

బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఈ సారి 41 వేల పైనే ఓట్లు మెజారిటీతో గెలిచారు. ఇలా రెండు సార్లు గెలిచిన వివేకానంద..మళ్ళీ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే మూడోసారి బరిలో దిగుతున్న కేపీ వివేకానందకు..కూన శ్రీశైలం గౌడ్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. శ్రీశైలం బి‌జే‌పి నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. అటు కాంగ్రెస్ నుంచి కోలన్ హనుమంత్ రెడ్డి రేసులో ఉన్నారు.

May be an image of 3 people, dais and text

అయితే  వివేకానంద ఏనాడూ ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు.. ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించారు. కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో నియోజకవర్గంలో సుమారు 6 వేల కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. చేసిన పనులు చెప్పాలంటే లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఆ స్థాయిలో వివేకానంద పనిచేశారు.

ఇక రాజకీయంగా కే‌పికి మద్ధతు ఎక్కువే. పారిశ్రామిక వాడగా పేరొందిన కుత్బుల్లాపూర్ లో తెలంగాణ ఓటర్లతో పాటు, ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన వారు ఎక్కువే. అయితే ప్రధానంగా బి‌సి వర్గాలదే ఇక్కడ హవా. వారే గెలుపోటములని డిసైడ్ చేస్తారు. గత మూడు ఎన్నికల్లో బి‌సిలే గెలిచారు. 2009లో కూన శ్రీశైలం గౌడ్  గెలిచారు. ఇండిపెండెంట్ గా ఆయన సత్తా చాటారు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. అప్పుడు వైఎస్సార్..శ్రీశైలంకు మంచి సపోర్ట్ ఇచ్చారు. 2014లో టి‌డి‌పి నుంచి కే‌పి వివేకానంద గౌడ్ పోటీ చేసి..కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీశైలం పై గెలిచారు. 2018లో కే‌పి బి‌ఆర్‌ఎస్ నుంచి శ్రీశైలం కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, గెలుపు కే‌పిని వరించింది.

Kuna Srisailam Goud

అయితే వరుసకు శ్రీశైలం గౌడ్, వివేకానంద గౌడ్.. బాబాయి-అబ్బాయి అవుతారు. ఈ సారి కూడా ఈ ఇద్దరు మళ్ళీ బరిలో ఉన్నారు. కాకపోతే శ్రీశైలం ఈ సారి బి‌జే‌పి నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ లో రెడ్డి నేత బరిలో ఉండే ఛాన్స్ ఉంది. దీంతో కాంగ్రెస్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చెప్పలేం. కానీ కే‌పి వివేకానంద, శ్రీశైలం మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది. ఇక్కడ పార్టీ పరమైన ఓటింగ్ తో పాటు.. వివేకానందకు సొంత బలం చాలా ఎక్కువ. అటు శ్రీశైలంకు బలమైన ఇమేజ్ ఉంది. చూడాలి మరి ఈ సారి కుత్బుల్లాపూర్ లో బాబాయి-అబ్బాయిలో పైచేయి ఎవరు సాధిస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news