ఇంటర్ పరీక్షలు రాయబోతున్నారా…? అయితే ఫలితాలు ఎలా వస్తాయి..? ఎలా ఎగ్జామ్ ని రాయగలను అని టెన్షన్ పడుతున్నారా..? అయితే తప్పకుండా మీరు వీటిని చూసి అనుసరించాలి. ఎక్కువ మంది పరీక్ష ముందు టెన్షన్ పడడం సహజమే. అందుకని భయపడకండి. ఈ విధమైన టెక్నిక్స్ ని ఫాలో అయ్యారంటే మంచిగా స్కోర్ చేయడానికి అవుతుంది. ఇలా చేశారంటే తక్కువ సమయం లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు.
రాత్రి పగలు కూడా మీరు కష్టపడి చదివే పద్ధతి ని మానుకోవాలి. కనీసం ఆరు గంటల పాటు నిద్ర పోవడం మంచిది. దీంతో మెదడు కి విశ్రాంతి దొరుకుతుంది.
అలానే మంచి నీళ్ళు కూడా ఎక్కువగా తాగుతూ ఉండండి. దీంతో శరీరం డీహైడ్రేషన్ కు గురి అవకుండా ఉంటుంది.
పరీక్షకు వెళ్తున్నప్పుడు అంతకు ముందు రాసిన పరీక్ష గురించి చర్చించ వద్దు. దాని వల్ల కూడా మరుసటి రోజు పరీక్ష మీద ప్రభావం పడుతుంది. కాబట్టి చర్చించ వద్దు.
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది.
అదే విధంగా కౌన్సెలింగ్ తర్వాత ధైర్యం వస్తుంది. పైగా ఇది మీకు శక్తి కూడా వస్తుంది. కాబట్టి మీరు అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోండి.
ఎక్కువ స్కోర్ చేయాలంటే బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ తో పాటు ఆన్లైన్ క్లాస్ లో జరిగిన వాటిని కూడా పోల్చి చూసుకోండి. ఆ తర్వాత మీరు మీ స్నేహితులతో కాసేపు వీటిని డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల అన్ని టాపిక్స్ మీకు గుర్తు ఉంటాయి.
ఎప్పుడూ కూడా నెగటివ్ గా ఉండకండి. మంచిగా చదివిన వాటిని ప్రెజెంట్ చూడండి.
ఇలా ఈ విధంగా పరీక్షకు ముందు జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా మీరు స్కోర్ చేయొచ్చు.