అది జరిగి ఉంటే నా భర్త బ్రతికేవాడు.. మీనా సంచలన వ్యాఖ్యలు..!!

ప్రముఖ నటి మీనా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె కొద్దిరోజుల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన మీనా బుల్లితెరపై కూడా పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా యుక్త వయసులోనే మీన తన భర్త విద్యాసాగర్ ను కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పాలి. ఇక భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. ఇక ఇటీవల సినిమా షూటింగ్స్ కి కూడా ఆమె హాజరయ్యారు.

ఇకపోతే ఈ క్రమంలోనే భర్త మరణం పై కీలక వ్యాఖ్యలు చేసిన మీనా సంచల నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యాసాగర్ ఆరోగ్యం విషమించినప్పుడు ఆయనకు ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని భావించారు. కానీ దానికి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవం లభిస్తే చేయాలని భావించారు. కానీ అంతలోనే జూన్ 28న విద్యాసాగర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక మీనా భర్త మరణం సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదం నింపింది. తాజాగా మీనా అవయవ దానం చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

ఇకపోతే ఆగస్టు 13వ తేదీన వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక అవయవాలను దానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు అని అనారోగ్యంతోనే బాధపడుతుంటే ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కల్లారా చూసానని ఆమె తెలిపింది. ఇక మా సాగర్ కు అలాంటి దాతలు దొరికి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు అంటూ మీనా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.