వరుడి ప్రొఫైల్ పంపితే.. జాబ్ ఆఫర్ చేసిన కూతురు.. పోస్ట్ వైరల్..!

-

ఈ రోజుల్లో బిడ్డలకు పెళ్లి చేయాలంటే..ఆ తల్లిదండ్రులకు చుక్కల కనిపిస్తున్నాయి. పూర్వం రోజుల్లో అంటే..పెళ్లి పీటల మీదే కాబోయే భర్తను చూసేవాళ్లు. రోజులు మారాయి.. అరెంజ్ మారేజ్ అయినా.. అబ్బాయిని మొత్తం స్కాన్ చేశాకే.. అమ్మాయిలు ఓకే చెప్తున్నారు. మరీ ఈ తరుణంలో.. ఆన్ లైన్ లో పెళ్లి సంబంధాలు చూసే సైట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అందులో మన పుట్టుపూర్వోత్రాలు అన్నీ పెట్టి చిన్న సైజ్ రెస్యూమ్ ఒకటి క్రియేట్ చేయాలి. అలా.. తన కూతురుకు ఆన్ లైన్ లో చూసిన ఒ అబ్బాయి ప్రొఫైల్ వాట్సప్ లో పంపిస్తే.. ఆమె..జాబ్ ఆఫర్ చేసింది. పిచ్చ క్రేజీగా ఉంది కదూ..!

బెంగళూరులోని ఓ స్టార్టప్‌ను నడుపుతున్న ఉదితా పటేల్‌కు ఆమె తండ్రి ఇటీవలే ఓ మ్యాచ్‌ పంపించాడు. అయితే, ఆ వ్యక్తి ప్రొఫైల్‌ను మెచ్చి ఆమె అతడికి జాబ్‌ ఆఫర్‌ చేసింది. విషయం తెలుసుకున్న తండ్రి ‘నువ్వేం చేశావో తెలుసా? పెళ్లి కోసం ప్రొఫైల్‌ పంపిస్తే రెజ్యూమ్‌ అడిగి ఇంటర్వ్యూ లింక్‌ పంపిస్తావా? వరుడి తండ్రికి నేనేం సమాధానం చెప్పాలి?’’ అంటూ ప్రశ్నల తండ్రి ప్రశ్నలమీద ప్రశ్నలు వేశాడు.. దీనికి ఆమె సింపుల్‌గా నవ్వుతూ ‘ఏడేళ్ల ఫిన్‌టెక్‌ అనుభవమంటే మామూలు విషయం కాదు.. అందుకే ఉద్యోగంలో నియమించుకుంటున్నా. సారీ’’ అంటూ రిప్లైయ్ ఇచ్చింది. దీనికి సంబంధించి తండ్రితో చేసిన చాట్‌ను ఆమె స్వయంగా ట్విటర్‌ లో పంచుకుంది. అంతే క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ అయింది.. ఆ తర్వాత ఏం జరిగింది అంటూ అందరూ అడగటం మొదలేశారు..

ఉదితా పాల్‌ సమాధానం చెప్పిందండోయ్‌. ప్రొఫైల్‌ నచ్చి జాబ్‌ ఆఫర్‌ చేస్తే అతగాడు ఏకంగా సంవత్సరానికి రూ.62 లక్షలు వేతనం అడిగాడట. అదనంగా మరికొన్ని ప్రయోజనాలు కూడా కోరాడట. దీంతో తామంత భరించే స్థితిలో లేమంటూ రిజెక్ట్‌ చేసినట్లు ఆమె చెప్పింది. అంతేకాదు తనపై కోపంతో మ్యాట్రిమొనీ సైట్లలో తన ప్రొఫైల్‌ను తండ్రి డిలీట్‌ చేశాడట.

ఈ తండ్రీ కూతుళ్ల ఎపిసోడ్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రముఖ మ్యాట్రిమొనీ సైట్‌ జీవన్‌ సాథీ స్పందిస్తూ.. ‘సరైన మ్యాచ్‌ ఏమైనా వెతకమంటారా’ అంటూ సరదాగా ట్వీట్‌ చేసింది. ఇక నెటిజన్లయితే ఫన్నీగా కమెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news