ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బిగ్ బాస్ విన్నర్ అతనే..

-

బిగ్ బాస్ నాలుగవ సీజన్ చాలా చప్పగా సాగుతుంది. బిగ్ బాస్ యాజమాన్యం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోతున్నారు. దానికి కంటెస్టెంట్లు కూడా ఓ కారణమే. అయితే ప్రస్తుత్తం చివరి దశకి వచ్చేసింది గనక అందరిలోనూ బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారనే విషయమై చాలా ఆసక్తి నెలకొంది. ఫినాలే టికెట్ గెలుచుకున్న అఖిల్ విన్నర్ గా నిలుస్తాడని అనుకుంటున్నారు. అయితే గత సీజన్ సెంటిమెంట్ పనిచేస్తే బిగ్ బాస్ విన్నర్ అఖిల్ అవుతాడని అంటున్నారు.

బిగ్ బాస్ మూడవ సీజన్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్, షో సగంలో ఉండగా ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హౌస్ లోకి వచ్చాక ఫినాలే టికెట్ గెలుచుకున్నాడు. ఈ సారి కూడా అచ్చం అలాగే అఖిల్, సీక్రెట్ రూంకి వెళ్ళాడు. శుక్రవారం ఫినాలే టికెట్ గెలుచుకున్నాడు. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే గనక అఖిల్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news