నీళ్ల కొరత ఉందంటే కార్లు వాష్ చేస్తున్న వైనం… నెట్టింట్లా విమర్శలు

-

కర్నాటక రాష్ట్రంలో నీటి కొరత అక్కడి జనాల్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్న కూడా కొందరు కారు వాషింగ్, గార్డెన్లు, భవన నిర్మాణాలకు నీటిని వాడుతున్నారు. దీనిపై నెట్టింట్ల నెటిజన్స్ మండిపడుతున్నారు.

బెంగుళూర్ వాటర్ సప్లై అండ్ స్టోరేజ్ బోర్డ్ మార్చి 10న నీటి వాడకం పై ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై రూ.5వేల జరిమానా కూడా విధిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు.అయినప్పటికీ అలా చేయడంతో అధికారులు 22 మందిపై కేసులు బుక్ చేసి,వారి నుంచి రూ.1.10 లక్షల ఫైన్ వసూలు చేశారు.కేవలం శుక్రవారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు జరిగిన ఉల్లంఘనలకు మాత్రమే ఫైన్ వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కారు కడగటం, పెరుటికి నీరు పెట్టడం, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు నీటిని వినియోగించడం వంటివి నిషేధించింది.మరోవైపు వేసవి నేపథ్యంలో హైదరాబాద్లోనూ చాలా ప్రాంతాల్లోని ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news