మీ రిలేషన్ లో ఇవి ఉంటే పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిది..!

-

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొన్ని సార్లు కొన్ని నెగెటివ్ సూచనలు కనబడుతుంటాయి. అటువంటి వాటిని జాగ్రత్తగా గమనించి పెళ్ళికి తొందర పడకుండా ఉంటేనే మంచిది. అయితే చాలామంది కపుల్స్ లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి చేసుకోక ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలను గమనించాలి. వాటిని కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

మీరు చెప్పే వాటికి నెగిటివ్ రియాక్షన్స్:

మీరు మీ పార్టనర్ తో ఏమైనా చెప్పాలనుకున్నా.. మీ ఆలోచనలు, మీ సలహాలు ఇవ్వాలనుకుంటే తాను అస్తమానూ చికాకు పడుతుంటే కచ్చితంగా భవిష్యత్తులో ఇది బాగా ఇబ్బంది అవుతుందని గమనించండి. కొంత మంది వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళి పోతూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా అసలు పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండడం నిజంగా కష్టం. కాబట్టి మీ పార్ట్నర్ లో కనుక ఇటువంటి రియాక్షన్స్ ని మీరు చూస్తే కచ్చితంగా మీరు పెళ్లి వరకు తీసుకు వెళ్లకపోవడమే మంచిది.

తను చెప్పిందే చెయ్యాలి అనడం:

కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పింది మాత్రమే చేయాలి అని ఉంటారు అయితే ఇది మోనిటర్ చేయడం కాదు. కేవలం వాళ్ళ మాటే నెగ్గాలి అన్న పంతం. మీ పార్ట్నర్ లో కనుక ఇలాంటి లక్షణాలు కనుక చూశారంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఒకసారి మీరు దీన్ని కూడా ఆలోచించుకోవడం మంచిది.

తికమక పడడం:

మీతో పార్టీలకి, పబ్బులకి వెళ్లాలని ఇష్టం ఉండి పెళ్ళికి మాత్రం ఇంకా వద్దు అంటున్నారు అంటే కచ్చితంగా మీరు ఆలోచించుకోవాలి. పెళ్లి వరకూ కూడా మీ రిలేషన్షిప్ తీసుకు వెళుతుందో లేదో అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ కనుక మీ పార్టనర్ కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటే అస్సలు మీరు అలాంటి రిలేషన్షిప్ లో ఉండకండి. దీని వల్ల చివరలో మోసపోతారు.

Read more RELATED
Recommended to you

Latest news