అడుగు బయట పెడితే రూ.6 లక్షల జరిమానా..!

-

గత ఏడాదిగా కరోనా మహమ్మారితో ప్రపంచమంతా బిక్కుమిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ జీవితాన్ని గడుపుతుండగా.. మరో కొత్త కరోనా సృష్టితో మరింత ఉక్కిరిబిక్కిరి అవున్నారు. కొత్త వైరస్‌ కట్టడికి ఆయా దేశాలు భిన్న విభిన్న పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల బ్రిటన్‌లో ఆ వైరస్‌ వ్యాప్తితో అధిక మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కట్టడి చేయకపోతే మరింత ప్రమాదం ఉందని గ్రహించిన ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంగళవారం అర్ధరాత్రి నుంచి రెండో విడత లాక్‌డౌన్‌కుకు శ్రీకారం చుట్టారు.

కఠిన చర్యలు చేపట్టడంతో ఆ దేశ ప్రజలు అడుగు బయటకు పెట్టాలంటేనే జంకుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు ఉల్లంఘించిన వారికి మొదటిసారి 200 పౌండ్లు ( ఇండియాలో రూ.20 వేలు) జరిమానా వి«ధిస్తారు. అదే వ్యక్తి మళ్లీ నిబంధన ఉల్లంఘించినట్లైతే ఏకంగా రూ.6.36 లక్షలు జరిమానా వసూలు చేస్తారు. అత్యవసర కారణం లేకుండా రహదారులపై కనబడితే నేరుగా జైలుకే పంపిస్తారు.

నిబంధను ఇవి..

1 ఈ రోజు నుంచి గ్రౌండ్లు, పార్క్‌లు, దుకాణాలు, విద్యాసంస్థలు, అన్ని రకాల పరీక్షలు రద్దు చేశారు. రోడ్లపై ఎలాంటి వాహనాలు రాకపోకలు సాగించిన శిక్షార్హులే.
2. ఆస్పత్రులు, కూరగాయల దుకాణాలు, పోస్టాఫీస్‌ లాంటి అత్యవసర సర్వీసులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.
3. చర్చిలు, ఇతర ప్రార్థన మందిరాల్లో పరిమితమైన సంఖ్యతో భౌతికదూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవచ్చు.
4. ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు రోగితో పాటు ఒక్కరే తోడుగా వెళ్లే నిబంధన పెట్టారు.
5. రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనాలు నిషేధం. పార్సిళ్లు తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
6. ఏదీ ఏమైన లక్షల్లో జరిమానా విధించడంతో ఆ దేశంలో కరోనాను కట్టడి చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news