బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వెళ్తే తీసి పారేస్తాం : సీఎం కేసీఆర్

-

బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తే వారిని తీసి పారేస్తామని హెచ్చరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మెజారిటీ సిట్టింగ్ అభ్యర్థులను కొనసాగిస్తుండగా.. కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు చేశారు.

కొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు. నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు. మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన చేయనున్నారు కేసీఆర్. కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనుండటం గమనార్హం. కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గంపా గోవర్దన్ అభ్యర్థన మేరకు అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు కేసీఆర్.  అయితే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే పార్టీ నుంచి తీసేస్తామని హెచ్చరించారు కేసీఆర్. కంటోన్మెంట్ స్థానంలో సాయన్న కుమార్తె లాస్యకు స్థానం కల్పించారు. అలాగే విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు సంజయ్ కి టికెట్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news