తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేసీఆర్ ఓడిపోతాడనే భయంతోనే కేసీఆర్ రెండో స్థానాల్లో పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తెలంగాణలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఓడి పోయాడు. కేసీఆర్ కూడా కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయమన్నారు.
కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారు. తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అంతర్జాతీయ ఎయిర్ ఫోర్ట్, హైదరాబాద్ డెవలఫ్ మెంట్ జరిగిందన్నారు. కానీ కేసీఆర్ తాను డెవలప్ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ అందజేశారని పేర్కొన్నారు. కేసీఆర్ మాయమాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎప్పుడూ ఎన్నికలు కేసీఆర్ ని ఓడించాలనే చూస్తున్నారు ప్రజలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలు సంతోషంగా ఉంటారని వెల్లడించారు రేవంత్ రెడ్డి.