ఫస్ట్ నైట్ రోజు అలా చేస్తే ఫుల్ హ్యాపీ..ఏం చెయ్యాలంటే?

-

ఫస్ట్ నైట్ పేరు వినగానే చాలా మందికి సిగ్గు మొగ్గ లేస్తుంది..ఏవో తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.నవదంపతులు ఇద్దరు కలిసి తమ కొత్త జీవితాన్ని  ప్రారంభించే మొదటి రోజు ఇది. అందువల్ల నవదంపతులు ఫస్ట్ నైట్ రోజున చాలా విషయాలను చర్చించుకోవాలి. భార్యాభర్తల మధ్య తొలి మూడు రోజులు వారి జీవిత ప్రయాణానికి ముఖ్యమైన రోజులు. ఫస్ట్ నైట్ రోజున ఇద్దరి మనసులోని భావాలను ఒకరికొకరు స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే వారి నిండు నూరేళ్ళ జీవితం హ్యాపీగా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఫస్ట్ నైట్ రోజున భార్యాభర్తలిద్దరూ ఎలా చేస్తే వారి లైఫ్ అంత హ్యాపీగా ఉంటుందో తెలుసుకుందాం..

అమ్మాయిలకు కాస్త కంగారుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య తొలి మూడు రోజులు అత్యంత కీలకం. అమ్మాయితో అబ్బాయి కాస్త ప్రశాంతంగా మాట్లాడాలి. ఆమె అభిప్రాయాలను, అభిరుచులను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీ కుటుంబ సభ్యుల పట్ల అమ్మాయికి సరైన అవగాహన కల్పించాలి.  పుట్టింటిని వదిలి అమ్మాయి అత్తవారింటికి వచ్చినప్పుడు అత్త వారి కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలని అనేది ఆమెకు కాస్త కంగారు ఉంటుంది..

ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకున్నప్పుడు ఆమెకు మీరు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. ఆమె కూడా మీ మాటలకు అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఫస్ట్ నైట్ అంటే రెండు శరీరాలు దగ్గర కావడం కాదు..అలా రెండు మనసులు ముడి పడాలి..ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితాన్ని ప్రారంభించాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఎటువంటి అపార్థాలకు తావుండదు. మీ జీవితం సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఉంటుంది. ఫస్ట్ నైట్ రోజున మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి సరైన సమయం..ఇవి తప్పక గుర్తుంచుకోండి…

Read more RELATED
Recommended to you

Latest news