బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..తాము ఇంకా ఏం చేయకముందే బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ముందుంది ముసళ్ల పండగ అని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.10 సంవత్సరాల పాటు చేసిన అవినీతిపై చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుందో మరి అని, బీఆర్ఎస్ నేతలను తలుచుకుంటుంటే బాధగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
కాగా, అంతకుముందు అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్ నాలెడ్జ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక హరీష్ రావుకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆకారం పెరిగింది తెలివి పెరగలేదంటూ హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.