మానవ శరీరానికి ఆసనాలు చాలా అవసరం అన్న విషయం తెలిసిందే..అయితే శృంగారంలో మాత్రం సరైన సుఖాన్ని ఆడ,మగలు పొందాలంటే యోగా,ఆసనాలు తప్పనిసరి అని వ్యాయామ నిపుణులు అంటున్నారు.ఆ ఆసనాలు ఏంటో ఒకసారి చుద్దాము..
యోగా చేయటం వల్ల మనం మన బాడీ చెప్పేది ఎలా వినాలి అనేది తెలుస్తుంది. మెదడుని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం తెలుసుకోవచ్చు. అయితే యోగా చేస్తే శృంగార జీవితం అభివృద్ధి అవుతుందట అందులో బెస్ట్ ఇవే..
ఆనంద బాలాసనం..
సెక్సువల్ ఆర్గాన్స్ కి బ్లడ్ ఫ్లో అయ్యేలా చేస్తుంది. అలానే ఈ ఆసనం వేయడం వల్ల పొజిషన్స్ మీకు సులభంగా ఉంటాయి. శృంగార జీవితం బాగుండాలంటే ఈ ఆసనం కూడా మీకు హెల్ప్ అవుతుంది ఇక ఈ ఆసనం ఎలా వేయాలో చూస్తే..
ముందుగా మీరు వెన్నెముక నేల మీదకి ఉండేటట్టు పడుకోవాలి మీ మోకాళ్ళను కిందకి వంచండి.
మీ పొట్ట దగ్గరికి మోకాళ్ళు రావాలి.
ఇప్పుడు మీ పాదాలను మీ చేతులతో తాకండి.
మీ పాదాలు రెండూ దూరంగా ఉండాలి.
మీ మోకాళ్ళను కూడా వైడ్‌గా ఉంచండి.
మీ పాదాలని మీరు చేతులతో తాకినప్పుడు పైకి ఉండేటట్లు చూసుకోండి ఇలా ఈ విధంగా చేయడం వల్ల శృంగార జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు..
కపాలభాతి ప్రాణాయామ..
ఒత్తిడిని దూరం చేయడానికి యోగా సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా యోగాను చేయడం వల్ల కార్టిసోల్ లెవెల్స్ తగ్గుతాయి. ఒత్తిడి పెరిగి పోవడం వల్ల శృంగార కోరికలు తగ్గిపోతాయి. డైలీ యోగా చేస్తే ఒత్తిడి దూరమై శృంగార కోరికలు పెరుగుతాయి.ఈ ఆసనాన్ని ఎలా వెయ్యాలో చూస్తే..
ఈ ఆసనం అనుసరించడం కోసం ముందు ఓ దగ్గర కూర్చోండి.ఇలా కూర్చున్న తర్వాత చేతులను మోకాళ్ళ పైకి వచ్చేలా చేయండి.
అలానే మీ అర చేతులు ఆకాశం వైపు ఉండేలా పెట్టాల్సి వుంది.
తర్వాత గట్టిగా శ్వాస తీసుకోండి.
బొడ్డు భాగాన్ని వెనుకకు నెట్టి మాత్రమే ఊపిరి వదలాలి.
ఊపిరి వదిలే సమయంలో మీ కుడిచేయిని కడుపు భాగంపై పెట్టి అబ్డామినల్ మజిల్స్ ఎలా కాంట్రాక్ట్ అవుతున్నాయనేది గమనించాలి.
రిలాక్స్ అవుతుంటే బొడ్డు, అబ్డామినల్ భాగాలు రిలాక్స్ అవుతాయి..
వీటితో పాటు లిజార్డ్ పోజ్ కూడా వెయ్యడం మంచిదే..అంతేకాదు రోజూ చేసే వ్యాయామాలు,వాకింగ్ చేయడం మంచిది.శరీరానికి శ్రమ ఉంటే ఏ పనిలోనైనా చురుగ్గా ఉంటారు..