సాధారణంగా ప్రతి ఒక్కరి వంటగదిలో ముఖ్యంగా ఉండే దినుసులలో మెంతులు కూడా ఒకటి. ఇక ఏ వంటలో అయినా సరే మెంతులను ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి అలాంటి మెంతుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
మెంతిగింజలలో విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని సెల్స్ ను ఫ్రీ రాడికల్స్ వలన కలిగే డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. ప్రసవం తరువాత కొంతమంది తల్లులకు పాలు తక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. అలాంటి వారు మెంతులు నానబెట్టిన నీరు ఉదయం లేవగానే త్రాగడం వల్ల పాల ఊత్పత్తి పెరిగి పిల్లలకు సరైన పోషణ అందుతుంది . ఇందులో ఉన్న యాంటీ వైరల్ ప్రాపర్టీస్ అనేవి జలుబు అలాగే గొంతునొప్పులకు మంచిమెడిసిన్ గా పనిచేస్తున్నాయి.
అంతేకాక కీళ్లనొప్పులు , గుండె నొప్పితో బాధ పడేవారికి చర్మసమస్యలని , బ్రాంకైటిస్, జుట్టు సమస్యలను, మలబద్దకాన్ని , పొట్టలో సమస్య, మూత్రపిండాల సమస్య,గుండెల్లో మంట ,మగవారిలో ఉండే సమస్యలతో తో పాటు ఇతర లైంగిక సమస్యలకు కూడా మెంతులు మంచి చిట్కాగా పనిచేస్తాయి. ఇకపోతే చిన్నపిల్లల్లో కడుపు నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు కూడా అందులో నానబెట్టిన నీటిని తాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు సంరక్షణలో మెంతులు చక్కగా పనిచేస్తాయి. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు.. రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇక ఈ మిశ్రమానికి ఒక బౌల్ లోకి వేసి..అందులో రెండు టేబుల్ స్పూన్ల గోరింటాకు పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరికాయ పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నీలగిరి ఆకుల పొడి వేసి టీ డికాషన్ సహాయంతో పేస్టులాగా కలపాలి. ఇక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఈ హెయిర్ మాస్క్ ను తలకు అప్లై చేయాలి.
ఇక కనీసం వారానికి రెండు సార్లు అయినా ఈ చిట్కాలు పాటించినట్లయితే జుట్టు సమస్యలు తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా, అందంగా, ఒత్తుగా పెరుగుతుంది.