ఏజెంట్ మూవీ బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

అఖిల్ అక్కినేని తాజాగా నటిస్తున్న చిత్రం ఏజెంట్.. మొదటిసారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్ ను అందుకున్న ఆయన 2021లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన మొదటి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సాఫ్ట్ రోల్ లో కనిపించిన అఖిల్ ఇప్పుడు ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడని చెప్పాలి. ఇప్పటివరకు ఆయన ఇటువంటి క్యారెక్టర్ లో కనిపించలేదని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా భారీగా విడుదల కాబోతోంది.

పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు పై యాక్షన్ త్రిల్లర్ అంశాలతో వస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్, సురేందర్ 2 సినిమా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా రన్ టైం ఇప్పుడు లాక్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం 2:30 గంటల రన్ టైం తో ఈ సినిమా ముగుస్తుంది. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇకపోతే బడ్జెట్ విషయానికి వస్తే.. అఖిల్ సినిమా కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ గా రాబోతోంది ఈ సినిమా.. ముందుగా రూ.50 కోట్ల లోపు అనుకున్నప్పటికీ కూడా తర్వాత బడ్జెట్ పెరిగి రూ.80 కోట్లకు పైగా బడ్జెట్తో సినిమా నిర్మాణం పూర్తయిందని నిర్మాతలు తెలియజేస్తున్నారు. వీటికి తోడు ప్రమోషన్స్ తో ఏకంగా రూ.85 కోట్ల దాకా ఖర్చయిందని సమాచారం.. ఇకపోతే ఏజెంట్ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలి.. ఇది ఆయన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. మరి ఏప్రిల్ 28వ తేదీన వస్తున్న ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news