భారతీయులు ఎక్కువగా ఆరాధించే దైవం శ్రీరాముడు.. శ్రీరాముడుకు ఎక్కువగా వడపప్పు, పానకం అంటే ఎంతో ఇష్టం..దానికి పెద్ద చరిత్రే ఉంది..శ్రీరామ నవమి రోజున శ్రీ రాముడికి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందులో శ్రీరాముడికి ఇష్టమైన ప్రసాదాల వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి భారతీయులు జరుపుకునే పండుగలలో చేసుకునే ప్రసాదాలు, పిండి వంటలు ఆయా కాలంలో వచ్చే వ్యాధులను దరిచేరినివ్వకుండా ఉంటాయని ప్రజలు నమ్ముతారు..
ఉగాది పండుగ సమయంలో చేసుకునే ఉగాది పచ్చడి కూడా ఉంటుంది.అంతే కాకుండా ఉగాది పండుగ తర్వాత వచ్చే శ్రీరామ నవమి పండుగ తయారు చేసుకునే రామయ్య కు నైవేద్యంగా పెట్టే ‘పానకం,వడపప్పు ప్రసాదాలలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
కొత్త కుండలో మిరియాలు బెల్లం తో పానకం తయారు చేసి నైవేద్యంగా సమర్పించి ప్రజలకు పంచుతారు. ఆరోగ్యం అంటే తినరేమో కానీ దేవుడి ప్రసాదం అంటే కచ్చితంగా తింటారు. అందుకే మన పూర్వికులు ఇలాంటి సంప్రదాయాలను ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పాలంటే శ్రీరామనవమి రోజు ముఖ్యమైన ప్రసాదం పానకం.. మిరియాలు యాలుకలు, బెల్లం శరీరానికి ఎంతో ఆరోగ్యం..వడ పప్పు అంటే పెసరపప్పుని నానబెట్టి అందులో వసంతకాలంలోనే మామిడికాయల తురుముని కలుపుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది అంతేకాకుండా ఇది జీర్ణం వ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పెసరపప్పు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.. వేడిని తగ్గిస్తుంది..ముఖ్యంగా ఎండాకాలంలో వడదెబ్బను తగ్గిస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఇక మర్చిపోకుండా శ్రీరామనవమికి తినండి…