స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన నటనతో, సేవాగుణంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ సినిమాలలోనే కాదు రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఆయన ఏ రోజు ఎవరిని కూడా ప్రత్యక్షంగా నిందించింది లేదు అని చెప్పాలి. కానీ ఒకానొక సమయంలో తనను టార్గెట్ చేసిన విజయనిర్మలను అందరి ముందే ఆ మాట అనడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇక అక్కడ జరిగిన అసలు విషయం మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..
మిస్సమ్మ , గుండమ్మ కథ, మాయాబజార్ , శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్యచంద్రగుప్త, సత్యం శివం లాంటి సినిమాలలో ఎన్టీఆర్ , ఏఎన్నార్ ఎలాంటి భేజసం లేకుండా నటించారని చెప్పవచ్చు . తర్వాత పద్మాలయ సంస్థలో తనకు నటించాలని ఉంది అని ఎన్టీఆర్ అడిగినప్పుడు ఎన్టీఆర్ – కృష్ణ కాంబినేషన్లో వచ్చిన దేవుడు చేసిన మనుషులు చిత్రానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. ఇక ఆ తర్వాత తరం వారు కూడా ఇలాంటి మల్టీసారర్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం జరిగింది.ఇక తర్వాత బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం లాంటి విజయవంతమైన చిత్రాల ద్వారా రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
ఇక పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఈయన ఒకసారి పదవీకాలం పూర్తి చేసిన తర్వాత 1989లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ పై కొన్ని వ్యంగ చిత్రాలు విడుదలయ్యాయి. ఇక అలా రాజకీయ చదరంగం , గండిపేట రహస్యం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, రిక్షావాలా వంటి సినిమాల తర్వాత దర్శకురాలు విజయనిర్మల ఓ ఫంక్షన్ లో కనపడితే అందరి ముందు.. ఏవమ్మా నామీద తీయడానికి ఇంకేమైనా మిగులుందా.. ఇంతేనా ? అని ఎన్టీఆర్ నవ్వుతూ అడిగారట. ఇక పెద్దాయన సరదాగా అడుగుతున్నారే కానీ ఏనాడు అంత సీరియస్గా తీసుకోలేదు . కానీ విజయనిర్మల మాత్రం ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చిత్రాల రూపంలో తెరకెక్కించింది.