తెలుగు సినిమాలో ఒక పాట ఉంటుంది.. నవ్వవయ్య బాబూ నీ సొమ్మేంపోతుంది.. నీసోకేపోతుంది అని.. ఈ మాట నిజమే.. నవ్వడం వల్ల సొమ్ముపోదూ, సోకూపోదు. పైగా రెండూ వస్తాయి కూడా.. నవ్వడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా..! కొంతమంది ఉంటారు.. ముచ్చు మోఖంతో.. అస్సలు వాళ్లకు హాస్యగ్రంధులు ఉన్నాయా లేవా అన్నట్లు బీహేవ్ చేస్తారు.. మొఖం మీద కొంచెం కూడా నవ్వు ఉండదు..ఇంకొంత మంది ఉంటారు.. ఎప్పుడూ మొఖం మీద చిరునవ్వు ఉంటుంది. వాళ్లను చూస్తే..మనకు కూడా హాయిగా నవ్వాలనిపిస్తుంది.! ఎన్ని కష్టాలు ఉన్నా మొఖంపై చిరునవ్వు చెరగకుండా చూసకోవడం అబ్బాయిలకే సాధ్యం అవుతుంది. నిత్యం కనీసం ఒక పావుగంట పాటు అయినా నవ్వితే..ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిత్యం 15 నిమిషాల పాటు నవ్వితే 2 గంటల పాటు నిద్రించినంత లాభం కలుగుతుందట… అంటే 2 గంటల పాటు నిద్రించడం వల్ల మన శరీరానికి ఏవిధంగానైతే ఆరోగ్యం కలుగుతుందో.. అదే ఒక్క పావుగంట పాటు నవ్వితే.. సరిగ్గా అదేలాంటి లాభం కలుగుతుందట.. భలే ఉంది కదూ..
నవ్వడం వల్ల శరీరంలో రక్త నాళాలు వెడల్పుగా మారుతాయట.. దీంతో రక్తసరఫరాకు సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నవ్వడం వల్ల ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండవచ్చు తెలుసా అమ్మాయిలూ.. నవ్వడం వల్ల ముఖంలో రక్త సరఫరా పెరుగుతుంది. ఇది ఆ ప్రాంతంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల నవ్వడం అనేది మనకు యవ్వనాన్ని అందిస్తుంది.
నిత్యం అనేక ఒత్తిళ్ల మధ్య సతమతం అయ్యే వారు కనీసం 15 నిమిషాల పాటు నవ్వితే చాలు.. ఒత్తిడి అంతా పోతుంది.. శరీరంలో హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి.
నవ్వడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. అదేంటీ.. షుగర్‌కు, నవ్వడానికి సంబంధం ఉంది.. ఎందుకంటే.. సుదీర్ఘకాలం ఒత్తిడి వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల నిత్యం నవ్వితే డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు.
నవ్వడం వల్ల శరీరంలో యాంటీ బాడీల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని సైంటిస్టుల పరిశోధన చేసి మరీ కనుగొన్నారు. నిత్యం నవ్వితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
నవ్వడం అనేది సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది… శరీరంలో ఏ భాగంలో అయినా నొప్పి ఉన్నప్పుడు కాసేపు నవ్వి చూడండి. తేడా మీకే తెలుస్తుంది.
నవ్వడం వల్ల ఛాతి భాగం, జీర్ణాశయం అన్నీ కదులుతాయి. దీంతో అంతర్గతంగా వాటికి వ్యాయామం అయినట్లు అవుతుంది. ఈ క్రమంలో ఆయా భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి.
నిద్రలేమి సమస్య ఉన్నవారు నిత్యం 15 నిమిషాల పాటు నవ్వితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. రోజూ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
నవ్వడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. బాగా అలసిపోయాం అనుకున్నప్పుడు కొంత సేపు నవ్వి చూడండి.
నవ్వమన్నారు బానే ఉంది.. మరి నవ్వడం ఎలా..? అర్రే..నవ్వడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి.. కామెడీ వీడియోలు చూడండి.. జోకులు చదవండి.. ఇన్‌స్టాలో కొందరు కామెడీ వీడియోలు చేస్తారు. వారివి చూడండి.. ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే..కబుర్లు చెప్పుకోండి.