వరి వేస్తే ఉరి అన్నది ఎవరు ?.. బీఆర్ఎస్ పై ఫైర్ అయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

-

బీఆర్ఎస్ నేతలు సిగ్గు, లజ్జా లేకుండా ధర్నాలు చేస్తున్నారు అని ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఈరోజు గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ మాట్లాడుతూ…రైతులకు సంకెళ్లు వేసింది మీరు కాదా? మీ పాలనలో రైతులకు గజ దొంగల్లా బేడీలు వేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లల్లో రైతులకు మీరు ఏం చేశారు? నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగింది? వరి వేస్తే ఉరి అన్నది ఎవరు? అని ఫైర్ అయ్యారు. రైతులను వరి సాగు వద్దని చెప్పి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో వరి వేసుకోలేదా? కేసీఆర్ లాగా రైతుల విషయంలో మోసం చేసే సర్కార్ మాది కాదు’అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు కొత్త చీఫ్ ను నియమిస్తుందని, తానూ రేసులో ఉన్నానని అన్నారు.పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారని అన్నారు. సామాజిక కోణంతో సంబంధం లేకుండా సమర్థులకే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని తెలిపారు. అనుభవం, సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news