గవర్నర్ కు చంద్రబాబు లేఖ.. ఈ-ఆఫీస్ మూసీవేతపై అనుమానాలు..!

-

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని లేఖ ద్వారా గవర్నర్ ను కోరారు చంద్రబాబు. ఈనెల 17 నుంచి 25 తేదీ వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసీవేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పారదర్శకత పాటించని ఈ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశముందని అనుమానాలు వ్యక్తం చేశారు.

చంద్రబాబు తన లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించినట్టయితే.. ఈ-ఆఫీస్ వెర్షన్ ను అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈ-ఆఫీస్ వెర్షన్ అప్ గ్రేడ్ వల్ల సీఎంవో, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి ఈ-ఆఫీస్ ఈనెల 17 నంచి 25 వరకు అందుబాటులో ఉండదు. అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ విధానం పై అధికారులు, రాజకీయ పార్టీలో అనుమానాలు ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్ సైట్ లో పెట్టకుండా రహస్యంగా ఉంచుతోందని దుయ్యబట్టారు చంద్రబాబు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ-ఆఫీస్ వెర్షన్ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news