వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు సిఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. వెంకటగిరిలో నేతన్న నేస్తం పథకానికి బటన్ నోక్కే కార్యక్రమంలో పాల్గొన్న జగన్..చంద్రబాబు, పవన్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఇక మహిళలు మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్లు అని పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. అమ్మాయిలను లోబరుచుకొని పెళ్లి చేసుకోవటం..నాలుగేళ్లు కాపురం చేయటం…వదిలేయటం..మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవటం..ఒకరితో వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అక్రమ సంబంధం నడిపే వారు ఒకరు అంటూ పవన్‌ని ఉద్దేశించి కామెంట్ చేశారు.
ఇక మరొకరు పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో డాన్స్ చేసిన వీడియోలు యూ ట్యూబ్ లో ఉన్నాయని లోకేష్ గురించి కామెంట్ చేశారు. ఇక అమ్మాయి కనపడితే ముద్దులు పెట్టాలి..లేదా కడుపు చేయాలని మాట్లాడే దౌర్భాగ్యుడు అంటూ బాలయ్య గురించి మాట్లాడారు. ఇంకొకరు 75 ఏళ్ళు వచ్చాయని..ఒక షోకు వెళ్ళి..ఆహా బావ..తాను ఆ వయసులో ఆ పనులు చేసిన వాడినే అని చెప్పుకునే ముసలాయన ఒకరు అని జగన్ విమర్శలు చేశారు. అంటే పవన్, లోకేష్, బాలయ్య, చంద్రబాబు ఈ నలుగురు గురించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తప్పుడు మాటలకు స్క్రిప్ట్ రామోజీ రావు అని, నిర్మాత చంద్రబాబు.. నటన, డైలాగులు దత్తపుత్రుడివి అని, మహిళలను ఎక్కడికో పంపిస్తున్నారని నిస్సిగ్గుగా ఒకరంటున్నారని ఫైర్ అయ్యారు. మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులను ఎవరూ అవమానించరని తెలిపారు. మొత్తానికి అందరికీ కలిపి జగన్ ఒక రౌండ్ గా కౌంటర్లు ఇచ్చారు.