మన పెద్దలు చెప్తూ ఉంటారు, చీకటి పడ్డాక ఇల్లుని శుభ్రం చేయకూడదని.. ఎందుకు చీకటి పడిన తర్వాత ఇల్లు తుడవకూడదు దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి రాత్రిపూట ఇల్లుని తుడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని పెద్దలు చెప్పడం జరుగుతుంది. చీకటి పడ్డాక ఇల్లు తుడిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదా..? లక్ష్మీదేవి వెళ్లి పోతుందా అనే విషయాన్ని చూస్తే చీకటి పడ్డాక ఇంటిని అసలు క్లీన్ చేయకూడదు చీకటి పడక ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చీకటి పడక ముందు ఇంటిని క్లీన్ చేస్తే బంగారం లేదంటే విలువైన వస్తువులు కింద పడితే మనం వాటిని చూడకుండా బయట పడేసే అవకాశం ఉంది.
చీకటి పడకముందే వెల్తురు ఉన్నప్పుడు ఇంటిని తుడుచుకుంటూ ఉండాలి. లేకపోతే ఇలాంటివి పోతాయి. ఈ కారణంగానే పెద్దలు చీకటి పడక ముందు ఇల్లుని తుడుచుకోవాలి అని చెప్పేవాళ్లు. చీకటి పడకముందు తల దువ్వుకుంటే మంచిది. చీకటి పడ్డాక తల దువ్వుకుంటే జుట్టు అన్నిట్లో పడుతూ ఉంటుంది.
జుట్టు ఎక్కడ రాలిందనేది కూడా మనకి కనపడదు అన్నంలోకి కూడా అది రావచ్చు. దీపాలు పెట్టే సమయంలో నిద్ర పోకూడదని కూడా పెద్దలంటూ ఉంటారు ఇలా చేయడం వలన దరిద్రం వస్తుందని అంటారు కానీ నిజానికి మనం సాయంత్రం ఆరు గంటలకి నిద్రపోతే రాత్రి పడుకోలేము అందుకని పెద్దలు ఇలా కండిషన్స్ పెట్టారు.