అక్కడ బిర్యానీ తినాలంటే.. ఒక రోజు ముందే ఆర్డర్‌ చేయాలట.. కాస్ట్‌ కూడా ఎక్కువే..!!

-

చికెన్‌, మటన్‌ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ ఎగబడి మరీ తింటారు. ఎక్కడైనా మొహమాటం ఉంటుందేమో కానీ.. ఈ బిర్యానీ దగ్గర మాత్రం నో మొహమాటం. ముఖ్యంగా హైదరాబాదీ చికెన్‌ బిర్యానీ అయితే..ఇంకా బాగుంటుంది. ఆ టేస్ట్‌ అబ్బో ఒక్కో ముద్ద పీస్‌తో నోట్లో పెట్టుకుంటుంటే.. స్వర్గమే..! మనం జనరల్‌గా రెస్టారెంట్‌కు వెళ్తే.. బిర్యానీ ఆర్డర్‌ ఇస్తే.. 15- 30 నిమిషాల్లో తీసుకొస్తారు. అంతకు మించి వెయిట్‌ ఉండదు..వీకెండ్స్‌లో అయితే.. ముందు టేబుల్‌ కోసమే ఒక గంట వెయిట్‌ చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ బిర్యానీ కావాలంటే.. ఒక రోజు ముందే ఆర్డర్‌ చేయాలంట.. ఇంకా బిర్యానీ కాస్ట్‌ కూడా వెయ్యిపైనే ఉంటుంది. అయినా ఈ బిర్యానీ కోసం జనాలు క్యూ కడతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడంటే..

లోహంగ్రీ జంషెడ్‌పూర్ ప్రజలు వెరైటీలలో దొరికే టెస్టీ ఫుడ్, పానీయాలను ఇష్టపడుతారు. అందుకే ఇక్కడ మీకు చాలా వంటకాలు దొరుకుతాయి. ఈ నేపథ్యంలో జంషెడ్‌పూర్‌లో చికెన్ మండీ బిరియానీ ఫేమస్ అవుతోంది. చికెన్ మండి ఒక సాంప్రదాయ అరబిక్ వంటకం. ఇందులో చికెన్, రైస్, మసాలా దినుసుల మిశ్రమం ఉంటుంది. దీనిని సాధారణంగా తక్కువ మంట మీద ఉడికించి తయారుచేస్తారు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది

జంషెడ్‌పూర్‌లో చికెన్ మార్కెట్ పెద్ద ప్లేట్‌లో బిర్యానీ, ఒక గోటా చికెన్ తందూరి, నాలుగు ముక్కలు హరియాలీ చికెన్, టిక్కా, నాలుగు ముక్కలు మలై చికెన్ టిక్కా, నాలుగు ముక్కలు చికెన్ టిక్కా అందుబాటులోకి ఉంచారు. అంతే కాకుండా.. నాలుగు ముక్కలు మస్తానా చికెన్ టిక్కా, రెండు ఉడికించిన గుడ్లు, రెండు ముక్కలు చికెన్ కర్రీ, రైతా, ఉల్లిపాయ, ఒక టర్కిష్ నాన్ వడ్డిస్తారు. దీని ధర ₹ 1499, హాఫ్ ప్లేట్ ధర ₹ 1099. ఇది 3 నుండి 4 మంది వరకు తినొచ్చు.

ఇక్కడ మటన్ మండి బిర్యానీ కూడా ఉంటుంది. దీని ధర ₹2099. ఇందులో ఒక ముక్క గోటా మటన్ రాన్, 3 ముక్కలు చికెన్ మలై టిక్కా, మూడు ముక్కలు చికెన్ హరియాలీ టిక్కా, మూడు ముక్కలు చికెన్ మస్తానా టిక్కా, మూడు ముక్కలు చికెన్ టిక్కా వెరైటీ ఉంటాయి. అదేవిధంగా.. రెండు ముక్కలు మటన్ సీక్ కబాబ్, రెండు ముక్కలు మటన్ గ్రేవీ, రైతా, ఉల్లిపాయ, ఒక టర్కిష్ నాన్. వడ్డిస్తారు. మటన్ మండి బిర్యానీ కోసం ఒక రోజు ముందుగానే ఆర్డర్ చేయాలట.

శాఖాహారులకు వెజ్ మండి బిరియాని ఎంపిక కూడా ఉంది. ఇందులో మీకు నాలుగు ముక్కలు వెజ్ పనీర్ టిక్కా, గ్రిల్డ్ మష్రూమ్, గ్రిల్డ్ బేబీ కార్న్, గ్రిల్డ్ బ్రోకలీ, చాలా మిక్స్ వెజ్ బిరియాని, ఒక ప్లేట్ పనీర్ బటర్ మసాలా, ఒక టర్కిష్ నాన్, దీని ధర ₹ 1299, హాఫ్ ప్లేట్ ₹ 899గా ఉంటుంది. జార్ఖాండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని డిమ్నా రోడ్‌లో ఉన్న మిస్టిక్ గ్రిల్‌లో మీరు ఈ మండీ బిర్యానీలన్నీ తినొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news