గోవా బ్యూటీ హీరోయిన్ ఇలియానా తాజాగా అందరికీ షాక్ ఇచ్చింది. తాను ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు ఒక పోస్ట్ పెట్టింది. ఆమె తల్లి కూడా దీనిపై కామెంట్ చేయడంతో ఇప్పుడు వైరల్ గా మారుతుంది.. అసలు విషయంలోకి వెళితే హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోకిరి సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె నాజూకు నడుము అందాలతో యువతను తన వశం చేసుకుంది. ఇక తర్వాత అల్లు అర్జున్ ,పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించి మెప్పించిన ఈమె కొత్త హీరోయిన్లు రావడంతో అవకాశాలు తగ్గిపోయి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
అక్కడ కూడా అవకాశాలు అందుకోవడం లేదని తెలుస్తోంది . దాంతో చాలా వరకు అందరూ ఆమెను మర్చిపోయారనే చెప్పాలి. అలాంటిది సడన్గా తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు ఇన్స్టా లో ఒక పోస్ట్ పెట్టడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది… ఇదిలా ఉండగా గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెభాష్టియన్ తో ఆమె రిలేషన్షిప్ లో ఉందనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి గురించి అసలు టాపిక్ ఏ లేకుండా డైరెక్ట్గా తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు ఇలియానా ఇప్పుడు పోస్ట్ పెట్టడం మరింత సంచలనాలకు దారితీస్తోంది.
దీనికి తోడు ఇలియానా తల్లి కూడా గ్రాండ్ వెల్కమ్ బేబీ అని కామెంట్ పెట్టడం విశేషం . మరి ఇలియానా పెళ్లి కాకుండా అనే తల్లి కావడంతో సర్వత్ర పలు ప్రకారం వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎంతో ఈమె ప్రెగ్నెంట్ అయ్యిందా లేక మరెవరైనా అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.
View this post on Instagram