కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు ని తీసుకు వస్తోంది. ఈ పథకాల వలన ఎన్నో లాభాలు కలుగుతాయి. ప్రత్యేకంగా రైతుల కోసం కూడా కేంద్రం కొన్ని పథకాల్ని తీసుకు వచ్చింది. వాటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఒకటి. ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబటి సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా నాలుగు శాతం వార్షిక వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా ఇస్తోంది. రైతులకు ప్రతీ నెలా పెన్షన్ వచ్చే స్కీము కూడా వుంది.
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన స్కీమ్ ని కూడా కేంద్రం అందిస్తోంది. ఈ స్కీమ్‌లో చేరిన రైతులు ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ ని పొందొచ్చు. కేంద్రం ఈ స్కీమ్ ని 2019లో తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ నెల రూ.3,000 పెన్షన్ వస్తుంది. అంటే ఏటా రూ.36,000 పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీము లో రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న వాళ్ళు చేరొచ్చు. 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు లోపు ఉన్న రైతులు ఎవరైనా కూడా ఈ స్కీము లో చేరేందుకు అర్హులే.
రూ.55 నుంచి రూ.200 మధ్య ప్రీమియం ఉంటుంది. 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వయస్సు కి రూ.110 , 40 ఏళ్ల వయస్సు కి రూ.200 ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రైతులు ప్రీమియం చెల్లించాల్సి వుంది. 60 ఏళ్లు వయస్సు దాటగానే ప్రతీ నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తుంది. అర్హులైన రైతులు దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి చేరచ్చు. ఆధార్ నెంబర్, బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాన్ని రైతులు పొందవచ్చు.