స్పా ముసుగులో వ్యభిచారం

-

మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఘుళిపించారు. హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో మొత్తం పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు.  మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు ఏఎస్ రావు నగర్ కు చెందిన ముంగడ హరీష్ (24) తో పాటు ఐదుగురు యువతులను అరెస్ట్ చేశారు. స్టూడియో – 11 పేరుతో హరిష్ కొంత కాలంగా స్పా నిర్వహిస్తున్నాడు, వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను అక్కడికి రప్పించి నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాల అడ్డగా స్పా సెంటర్ని మార్చుకున్నాడు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి హరీష్ తో పాటు ఐదుగురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మెట్టుగూడలోని గాయత్రి ప్లాజాలో గల స్టార్ స్పా సెంటర్ ని పోలీసులు తనిఖీలు చేయగా బెంగళూరుకి చెందిన నిర్వాహకుడు సమీర్ అగర్వాల్ తో పాటు మరో ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. యూపీ, పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news