పాకిస్తాన్: హిందూ దేవాలయంపై దాడి.. సుప్రీం కోర్టులో విచారణ.

-

పాకిస్తాన్ లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో భుంగ్ నగరంలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. వందలాది మంది గుంపులు గుంపులుగా చేతుల్లో ఆయుధాలతో వచ్చి దేవాలయంపై దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. హిందూ దేవాలయంపై దాడిని ఖండిస్తున్నామని, ఇందుకు పాల్పడిన నిందితులందరినీ అరెస్టు చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ అంశం పాకిస్తాన్ సుప్రీం కోర్టులో ఉంది.

ఐతే ప్రధాని ఖండన భారతదేశం నుండి పిలుపు వచ్చిన తర్వాత చేయడం గమనార్హం. పొరుగు దేశంలో ఉన్న మైనార్టీలకు భరోసా కల్పించాలని పాకిస్తాన్ ఛార్జ్ డి అఫెయిలర్లను పిలిచిన తర్వాత పాక్ ప్రధాని ఖండించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో శుక్రవారం రోజున ఈ విషయమై విచారణ జరగనుంది. ఇందుకోసం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ సెక్రటరీ, పోలీస్ ఛీఫ్ కూడా హాజరు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news