ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అందరిలో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీని వల్ల ఒత్తిడి పెరగడం తో పాటు ఏమి ఆహారం తినాలో, తిన కూడదో కూడా తెలియని పరిస్థితి. కరోనా సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
కరోనా సమయం కనుక యావత్ ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న నేపధ్యంలో ఇంట్లో ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్ ని ఎదుర్కోవచ్చు. అవి మీ మనసుని ఉల్లాసంగా ఉంచుతాయి.
1. కొంత మందికి నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల మనసు రిఫ్రెష్ అవుతుంది. మీకు నీరసంగా అనిపించినప్పుడు ఒక కప్పు కాఫీ తాగడం మంచిది.
2. అలాగే డార్క్ చాక్లెట్, పెరుగు కూడా తీసుకోవచ్చు. పెరుగు శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగు తో అరటి పండు కలిపి తింటే మంచి బలవర్ధకమైన ఆహారంగా ఉండి తక్షణమే శక్తిని ఇస్తుంది.
3. నట్స్ కూడా శరీరానికి కావలసిన పోషకాలను అందించి డి ఫ్రెషన్ నుండి బయట పడేస్తాయి.
4. అరటి, ఆరెంజ్ వంటి పళ్ళను క్రమం తప్పకుండా రోజుకి ఒకటి చొప్పున తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
5. గ్రీన్ టీ తాగడం వల్ల మానసికంగా ఉల్లాసాన్ని కలిగించి శరీర అలసటను తగ్గిస్తుంది.
6. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటూ శరీరానికి కావలసిన వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.