జియో-గూగుల్‌ రూ.33,737 కోట్ల డీల్…!

-

రిలయన్స్ ఇండస్ట్రీస్ చెందిన జియో ఫ్లాట్ ఫామ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక దిగ్గజ టెక్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఫేస్ బుక్ సంస్థతో మొదలైన ఈ పెట్టుబడులు అనేక కంపెనీలు జియో ఫ్లాట్ ఫామ్ లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ కూడా ఏకంగా రూ. 33,737 కోట్లను పెట్టుబడి పెట్టబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలియజేశారు. ఈ పెట్టుబడులతో జియో ఫ్లాట్ ఫాం లో గూగుల్ 7.7 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు అవుతుంది.

jio google
jio google

నేడు 43వ వార్షిక సాధారణ సమావేశం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తొలిసారిగా రిలయన్స్ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ పెట్టుబడుల కారణంగా రిలయన్స్ జియో లోకి రూ. 2.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. దీంతో పెట్టుబడుల సమీకరణ లక్ష్యాన్ని తాము చేరుకున్నామని తెలుపుతూ… తమ సంస్థ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు. దేశంలో అత్యధికంగా జిఎస్టి చెల్లించే సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చేరిందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే టెలికాం రంగంలో నెంబర్ 2 గా జియో నిలిచిందని, అలాగే వాటాదారులకు ఇచ్చిన హామీ ప్రకారమే గడువుకు ముందే రుణ రహిత కంపెనీగా రిలయన్స్ ను మార్చామని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news