ప్రస్తుతం దేశ టెలికాం రంగ సంస్థలలో రిలయన్స్ జియో దూసుకు వెళ్తుంది. నేడు జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సమావేశంలో డిజిటల్ రంగంలోకి మరో విప్లవానికి జియో తెరలేవనుంది. అదేమిటంటే, వచ్చే ఏడాది నుండి భారతదేశంలో జియో సంస్థ కు సంబంధించి 5G సేవలు అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 5G సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇప్పటివరకు భారతీయులు 500 కోట్ల జీబీ డేటాను జియో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా వినియోగించినట్టు ఆయన తెలియజేశారు.
అలాగే నేటి సమావేశంలో 5G కు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఆయన విడుదల చేశారు. ఈ 5g సేవలు వినియోగదారులకు 2021 నుండి అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలియజేశారు. మొదటగా భారతదేశంలో 5G సేవలందించిన తర్వాత, ఇతర దేశాల్లో కూడా జియో 5G సేవలను అందించే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ… భారతదేశంలో తయారైన టెక్నాలజీ సేవలు ఇప్పుడు ప్రపంచదేశాలకు అందించాల్సిన సమయం వచ్చిందని తెలియజేశారు. ఎవరైతే జియో సేవలు వినియోగిస్తున్నారో వారందరికీ జియో 5G సేవలు పొందే విధంగా తమ నెట్వర్క్ ను రూపొందిస్తున్నామని తెలియజేశారు. జియో 5G ద్వారా భారతీయుల లైఫ్ స్టైల్ లో భారీ మార్పులు సంభవిస్తాయని ముఖేష్ అంబానీ తెలియజేశారు.